
నేను చిన్నగున్నప్పుడు మా తాత రోజు రాత్రి లేశి, కట్టె వట్టుకొని “ఉష్.. ఉష్.. ఉష్..” అని అనుకుంట ఊరవుతల దాంక పోతుండే, మళ్ళ యే మబ్బులనో వచ్చి పండుకుంటుండే. అట్ల రోజు కట్టె తీసుకొని పోవుడు “ఉష్ ఉష్” అని తరుముడు మళ్ళ వచ్చుడు. ఇట్ల జరుగుతనే ఉంటుండే. మాకు తాతకు ఏమైందో అస్సలు అర్థం కాక పోతుండే. మా ఇంట్ల అందరు తాత ఎటు పోతున్నడు అని, తాత ఎనుక మేము గిట్ల పోయినము. తాత ఊరవుతల చెట్ల మీద, గుట్టల మీద కట్టె కొట్టుకుంట “ఉష్.. ఉష్.. పోవే.. పోవే..” అంటున్నడు. అట్ల మబ్బుల దాంక కొట్టి, మళ్ళ వచ్చి పండుకున్నడు. ఒక నాడు మా తాతను అందరం నిలదీశి అడిగినము. నువ్వు రాత్రి పూట ఎవ్వల్లను ఉష్.. ఉష్.. అని ఎల్లగొడుతున్నవు అని అంటే దానికి తాత పెద్ద పిట్ట బిడ్డ, పెద్ద పిట్ట. పెద్ద పిట్ట ఒర్రితే ఊరు ఊరు నాశనమైతది. ఎవడో ఊరు మీద ప్రత్యంగిరనో, ఉపాంగిరనో చేస్తే పెద్ద పిట్ట అట్ల ఒర్రుతది అని చెప్పిండు. ప్రత్యంగిర, ఉపాంగిర అనేవి భయంకరమైన తాంత్రిక విద్యలు. ప్రత్యంగిర చేస్తే పక్కనోడు నాశనం అయితడు. ఉపాంగిర చేస్తే ఊరంతా నాశనమయితది. మా తాత ఈ సంగతి చెప్పినప్పటి నుండి, ఊరందరు రాత్రి కాంగనే కట్టెలు వట్టుకొని చెట్ల మీద, గుట్టలమీద “ఉష్.. ఉష్.. పోవే.. పోవే…” అని కొడుతున్నరు. అట్ల ఇప్పటికీ మా ఊళ్ల రాత్రికి ఒక సారి పెద్ద పిట్ట కోసం.. పటాకులు కాల్చి, కొద్ది సేపు ఊరవుతల దాంక డప్పు కొడుతుంటరు కని ఇంత వరకు పెద్ద పిట్ట అరుపు విన్నోడు, పెద్ద పుట్టను చూశినోడు ఎవడు లేడు. రోజు మా తాత మాత్రం “ఉష్.. ఉష్.. పోవే..ఉష్..ఉష్..పోవే..” అని నిద్రల ఆయన పక్కకున్న కట్టెను కొట్టుకుంట అంటనే ఉంటడు. గమనిక : ఈ కథను 2018లో నా సినిమా కథలో బాగంగా నేను రాసుకొని, గీసుకొని నలుగురితో పంచుకున్నది.
When I was a child, my grandfather would wake up every night, pick up a stick, and walk out of the village muttering, “Ush… Ush… Ush…” as he went. After a while, he would come back and lie down again. Every night it was the same. He would take his stick, go out saying “Ush… Ush…,” chase something away, and then return.
None of us could understand what was happening to him.
One day, we decided to follow him. We quietly walked behind him as he left the village. He climbed onto hillocks, struck trees and rocks with his stick, and shouted, “Ush… Ush… Go away… Go away…!”
He kept doing this until he reached the edge of the village, then returned home and went back to sleep.
Finally, one day, the whole family confronted him.
“Who are you chasing away every night?” we asked.
My grandfather replied, “The Great Bird, child. The Great Bird. If the Great Bird cries out, an entire village can be destroyed. If someone performs Pratyangira or Upangira upon a village, the Great Bird begins to call.”
Pratyangira and Upangira, he explained, were fearsome forms of occult practices. If Pratyangira was performed, a single person would be ruined. If Upangira was performed, an entire village could be destroyed.
From the day my grandfather told us this story, the whole village began joining him. Every night, people carried sticks, climbed trees and hilltops, and shouted, “Ush… Ush… Go away… Go away…!” while striking the ground and the trees.
Even today, in our village, people burst firecrackers and beat drums outside the village for a while each night to drive away the Great Bird.
Yet, to this day, no one has ever heard the cry of the Great Bird.
No one has ever seen it.
Only my grandfather, night after night, even in his sleep, would reach for the stick beside him and murmur,
“Ush… Ush… Go away…
Ush… Ush… Go away…”
Note:
I wrote and illustrated this story in 2018 as part of a film script and shared it with a few people.
Leave a comment